బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 13:29:19

ప్రతి ఒక్కరికీ అయోధ్య రాముడి దర్శనం : యోగి ఆదిత్యనాథ్‌

ప్రతి ఒక్కరికీ అయోధ్య రాముడి దర్శనం : యోగి ఆదిత్యనాథ్‌

చిత్రకూట్‌ :  కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా చిత్రకూట్‌లోని లాలాపూర్‌ గ్రామంలోని ఆశ్రమంలో సీఎం బస చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గ్రామాల నుంచి ప్రతి ఒక్కరినీ అయోధ్యకు పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. మహమ్మారి తగుముఖం పట్టిన తర్వాత దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.