బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 22:01:36

ప్రైమరీ తరగతుల కోసం ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌

ప్రైమరీ తరగతుల కోసం ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌

న్యూ ఢిల్లీ: కొవిడ్‌-19తో భోదనా ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా కేంద్ర సర్కారు ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక తరగతుల కోసం ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ గురువారం విడుదల చేశారు. ఏప్రిల్‌లో విడుదల చేసిన క్యాలెండర్‌కు ఇది కొనసాగింపని పేర్కొన్నారు. ఎనిమిది వారాలపాటు బోధనా ప్రక్రియ సాగేలా ఇది ఉపాధ్యాయులకు మార్గదర్శకం వహిస్తుందన్నారు.  

‘దీనిని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) అభివృద్ధి చేసింది. ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన మార్గాల్లో విద్యను అందించేందుకు అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, సోషల్ మీడియా సాధనాలపై ఉపాధ్యాయులకు ఇది మార్గదర్శకాలను అందిస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అభ్యాసకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిని ఉపయోగించుకోవచ్చు’ అని ఈ సందర్భంగా నిశాంక్ చెప్పారు. మొబైల్‌, రేడియో, టీవీ, ఎస్‌ఎంఎస్‌, సోషల్‌ మీడియా సాధనాల ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే అవకాశాన్ని ఈ కొత్త అకాడమిక్‌ క్యాలెండర్‌ కల్పిస్తుందని చెప్పారు.   


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo