మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 13:38:08

కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేకు క‌రోనా

కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేకు క‌రోనా

హైద‌రాబాద్‌: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేకు క‌రోనా వైరస్ సంక్ర‌మించింది.  ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు.  రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన అత్వాలే ఆదివారం జ‌రిగిన ఓ ఈవెంట్‌లో హీరోయిన్ పాయ‌ల్ ఘోస్‌ను త‌న పార్టీలోకి స్వాగ‌తించారు.  అయితే ఆ త‌ర్వాత ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.  ద‌గ్గు, ఒళ్లు నొప్పులు రావ‌డంతో.. ఆయ‌న క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారు.  అయితే ఇవాళ వ‌చ్చిన రిపోర్ట్‌లో ఆయ‌న పాజిటివ్ అని తేలింది.  ముంబైలోని హాస్పిట‌ల్‌లో ఆయ‌న చికిత్స తీసుకోనున్నారు.