శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 19:57:00

బుల్లితెరపై మరోసారి రామాయణ్, మహాభారత్

బుల్లితెరపై మరోసారి రామాయణ్, మహాభారత్

హైదరాబాద్: కరోనా పుణ్యమా అని దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. మామూలుగానే వినోదం అవసరం. ఇప్పుడైతే ఇంటి నుంచి బయటకు రావద్దు. డైలీ సీరియల్స్ చిత్రీకరణకు లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. ఈ పరిస్థితుల్లో పాత సీరియల్స్, ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా ఆ సమాయనికి ఇంటికి రప్పించిన ఘనచరిత్ర కలిగిన సీరియల్స్ దుమ్ము దులపాలని దూరదర్శన్ భావిస్తున్నది. రామానంద్ సాగర్ రామాయణ్, బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్స్‌కు ఉన్న పాలోయింగ్ ఇంతాఅంతా కాదు. నిన్నటితరాన్ని ఉర్రూతలూగించిన ఆ సీరియల్స్‌ను మరోసారి బుల్లితెరమీదకు తేవాలనేది ఆలోచన. ఆ సీరియల్స్ ప్రస్తుత హక్కుదారులతో చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని ప్రసారభారతి సీఈవో శశి శేఖర్ ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. త్వరలో మిగతా వివరాలు మీ ముందు ఉంచుతానని ఆయన డీడీ ప్రేక్షకులను ఉద్దేశించి భరోసా ఇచ్చారు. 21 రోజుల లాక్‌డౌన్ దృష్ట్యా ప్రజలు మహాభారత్, రామాయణ్ సీరియిల్స్ ను కోరుకుంటున్నారని ఓ జర్నలిస్టు పెట్టిన పోస్టుకు స్పందనగా శశి శేఖర్ ఆ ట్వీట్ పెట్టారు. నిన్నటితరం ఎంజాయ్ చేసిన ఈ సీరియల్స్ నేటి తరానికి అవసరమని సీనియర్ జర్నలిస్టు మధుపూర్ణిమా కిష్వర్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.logo