శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:26:19

ఇంటి నుండే భూమి పూజను చూసి దీపాలు వెలిగించండి : రామాల‌య ట్ర‌స్టు

ఇంటి నుండే భూమి పూజను చూసి దీపాలు వెలిగించండి : రామాల‌య ట్ర‌స్టు

ల‌క్నో : ఆగ‌స్టు 5న అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి జ‌రిగే భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని ఇంటి నుండే చూడాల్సిందిగా శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను కోరింది. అయోధ్య చేరుకోవడానికి ఆత్రుత చూపొద్దంది. ఇంటి వ‌ద్ద నుండే కార్య‌క్ర‌మాన్ని వీక్షించి ఆ రోజు సాయంత్రం ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో దీపాలు వెలిగించాల్సిందిగా విన్న‌వించింది. అయోధ్య రామాల‌యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 5న పునాది రాయి వేయ‌నున్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందిస్తూ.. 1984 లో ప్రారంభమైన ఈ ఉద్యమంలో రామాల‌య నిర్మాణానికి భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

భూమి పూజ జ‌రుగుతున్న‌ ఈ చారిత్రక స‌మ‌యంలో అయోధ్యలో ఉండాల‌నుకోవ‌డం భక్తులందరి సహజ కోరిక అన్నారు. శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ కూడా ఇలాంటి అనుభూతినే కలిగి ఉందన్నారు. కానీ కోవిడ్‌-19 వ్యాప్తితో ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్య‌ప‌డ‌త‌లేద‌న్నారు. భూమి పూజ‌కు సంబంధించి దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారమ‌య్యే కార్య‌క్ర‌మాన్ని చూడాల్సిందిగా ఆయ‌న కోరారు. ఆగ‌స్టు 5న దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల్లో పూజారులు ఉద‌యం 11.30 గంట‌ల నుంచి 12.30 గంట‌ల వ‌రు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. 


logo