మంగళవారం 31 మార్చి 2020
National - Feb 18, 2020 , 10:02:05

స‌మాధుల‌పై రామాల‌యం నిర్మిస్తారా ?

స‌మాధుల‌పై రామాల‌యం నిర్మిస్తారా ?

హైద‌రాబాద్‌:  సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం ట్ర‌స్టును ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ న‌గ‌ర ముస్లిం ప్ర‌జ‌లు ట్ర‌స్టు అధిప‌తి లాయ‌ర్ కే ప‌ర‌శ‌ర‌న్‌కు ఓ లేఖ రాశారు.  రామాల‌య నిర్మాణం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధంగా ఉంద‌ని ఆ లేఖ‌లో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయ‌బ‌డ్డ బాబ్రీ మ‌సీదు ప్రాంతంలో ముస్లింల స‌మాధులు ఉన్నాయ‌ని, ఆ స‌మాధుల‌పై రామాల‌యాన్ని నిర్మించ‌డం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధ‌మ‌ని ముస్లిం త‌ర‌పున న్యాయ‌వాది ట్ర‌స్టుకు లేఖ రాశారు. అడ్వ‌కేటు ఎంఆర్ శంషాద్ ఆ లేఖ‌ను ఈనెల 15వ తేదీన ట్ర‌స్టుకు పంపారు. 1885లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో సుమారు 75 మంది ముస్లింలు చ‌నిపోయార‌ని, వారి స‌మాధులు అక్క‌డే ఉన్నాయ‌ని, బాబ్రీ మ‌సీదు ప్రాంతాన్ని శ్మ‌శాన‌వాటిక‌గా వాడార‌ని, అలాంటి చోట రామాల‌యాన్ని ఎలా నిర్మిస్తార‌ని ఆ లేఖ‌లో ప్ర‌శ్నించారు.  ముస్లింల స‌మాధుల‌పై రాముడి జ‌న్మ‌స్థాన ఆల‌యాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తుందా అని, ట్ర‌స్టు దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేఖ‌లో కోరారు. 67 ఎక‌రాల భూమిలో సుమారు 5 ఎక‌రాల స్థ‌లంలో ముస్లింల శ్మ‌శాన‌వాటిక ఉంద‌ని శంషాద్ తెలిపారు.  మొత్తం 67 ఎక‌రాల భూమిని ఆల‌య నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు న్యాయ‌వాది తెలిపారు.  


logo
>>>>>>