శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 01:37:11

ఆర్నెళ్లలో రామమందిర నిర్మాణం ప్రారంభం

ఆర్నెళ్లలో రామమందిర నిర్మాణం ప్రారంభం
  • శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు గోపాల్‌ దాస్‌ వెల్లడి

గ్వాలియర్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణం మరో ఆర్నెళ్లలో ప్రారంభమవుతుందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ తెలిపారు. ట్రస్ట్‌ తదుపరి సమావేశంలో నిర్మాణ తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. ఇంతకుముందు ప్రదర్శించిన నమూనా తరహాలోనే మందిర నిర్మాణం జరుగుతుందని, కొద్దిగా మార్పులు ఉండొచ్చన్నారు. విరాళాల ద్వారా కానీ, ప్రభుత్వ నిధులతో కానీ ఆలయాన్ని నిర్మించబోమని, ప్రజల సహకారంతోనే మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి అఖారాల అధిపతులు త్వరలోనే సమావేశం అవుతారన్నారు. ట్రస్ట్‌లో చోటు కల్పించకపోవడంపై కొందరు సాధువులు అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. సామరస్యతకు భంగం కలుగకుండా మందిర నిర్మాణాన్ని చేపట్టాలని మోదీ సూచించినట్టు చెప్పారు. 


logo