సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 21:41:29

దీపాలు వెలిగించి టపాసులు కాల్చిన ఆదిత్యనాథ్

దీపాలు వెలిగించి టపాసులు కాల్చిన ఆదిత్యనాథ్

లక్నో : అయోధ్యలోని రామాలయానికి పునాది రాయి వేస్తున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపాలు వెలిగించి..పటాకులు కాల్చారు. లక్నోలోని తన అధికారిక నివాసంలో మంగళవారం రాత్రి ముందస్తు 'దీపావళి' జరుపుకున్నారు. పవిత్ర నగరం అయోధ్యలో జరుపతలపెట్టిన మెగా కార్యక్రమానికి ముందే కాన్పూర్ తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో దీపోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు కాన్పూర్‌లో మట్టి దీపాలను వెలిగించి 'దీపోత్సవ్'ను ఘనంగా జరిపారు.

అయోధ్యలో బుధవారం భూమిపూజ కార్యక్రమం ప్రారంభం కాగానే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నాగ్‌పూర్‌లో రామ్‌చారిత్ మానస్, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టనున్నారు. సంఘ్ ప్రధాన కార్యాలయంలో నివసించే కార్యకర్తలు దీపాలు వెలిగించి, 'హనుమాన్ చాలీసా', 'రామ్‌చారిత్ మానస్' పఠించనున్నారు. అయోధ్యలో భారీ కార్యక్రమం సందర్భంగా ట్రెటాయగ్ లాంటి ముఖభాగాన్ని సృష్టించడానికి అయోధ్యలోని ఇండ్లు, భవనాలను పసుపు రంగులో పెయింట్ చేశారు.

అయోధ్యలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరవుతున్నందున అయోధ్య నగరం చుట్టూ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.logo