మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 14:48:59

రామ్ రహీమ్ బాబాకు రహస్యంగా పెరోల్‌.. సాయుధ కారులో గుర్గావ్ తరలింపు

రామ్ రహీమ్ బాబాకు రహస్యంగా పెరోల్‌.. సాయుధ కారులో గుర్గావ్ తరలింపు

హర్యానా : లైంగికదాడి, హత్య కేసుల్లో దోషి డేరా సచ్చా సాచా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ బాబాకు రహస్యం పెరోల్‌ మంజూరైంది. ఒకరోజు పెరోల్‌పై బాబా బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి రామ్ రహీమ్‌కు గత నెల 24 న పెరోల్ మంజూరు చేశారు. వివాదాస్పద బాబాకు పెరోల్‌ లభించి బయటకు రావడంపై మీడియాకు కూడా తెలియకుండా హర్యానా ప్రభుత్వం జాగ్రత్తపడింది. సాయుధ కారులో జైలు నుంచి గుర్గావ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న తన తల్లిని పరామర్శించారు. ఒక పెద్ద పోలీసు కాన్వాయ్ కూడా భద్రతలో పాల్గొన్నది. నిబంధన ప్రకారమే ఆయనకు పెరోల్‌ లభించిందని జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌ సింగ్‌ చౌతాలా చెప్పారు. 

గుర్మీత్ రామ్ రహీమ్ బాబా 2017 ఆగస్టు 257 నుంచి రోహతక్ జైలులో ఉన్నారు. లైంగికదాడి, జర్నలిస్ట్ రాంచంద్ర ఛత్రపతి హత్యకు సంబంధించి రామ్ రహీమ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. గతంలో పలు సార్లు పెరోల్ కోసం పిటిషన్ పెట్టుకున్నప్పటికీ అనుమతి లభించలేదు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కడసారి చూసేందుకు అనుమతించాలని కోరగా గత నెల 24 న పెరోల్‌ మంజూరయింది. ఒకరోజు బయటకు వచ్చేందుకు పెరోల్‌ లభించడంతో హర్యానా పోలీసులకు చెందిన మూడు బృందాలను మోహరించారు. డెరా చీఫ్‌ను జైలు నుంచి పోలీసు కారులో కర్టెన్లు అంటించి తీసుకువచ్చారు. గురుగ్రామ్‌లో పోలీసులు కారును దవాఖాన అండర్‌గ్రౌండ్‌లో నిలిపి ఉంచి బాబాను పైకి తీసుకువచ్చారు. బాబా తల్లి చికిత్స పొందుతున్న అంతస్తును పూర్తిగా ఖాళీ చేశారు. రామ్‌ రహీమ్‌ బాబాకు పెరోల్‌ వచ్చిన విషయాన్ని రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించారు. రామ్ రహీమ్ గుర్గావ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్ల కోసం జైలు సూపరింటెండెంట్ నుంచి తనకు వినతి వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు, శనివారం మధ్యాహ్నం రాష్ట్ర జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అన్ని నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రామ్ రహీమ్‌కు పెరోల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

జర్నలిస్టు హత్య కేసులో దోషి

2002 లో జర్నలిస్ట్ రామ్‌చంద్ర ఛత్రపతి కాల్చి చంపిన కేసులో రామ్‌ రహీమ్‌ను నిందితుడుగా ఉన్నారు. ఛత్రపతి తన వార్తాపత్రికలో డేరాకు సంబంధించిన వార్తలను ప్రచురించేవాడు. జర్నలిస్ట్ ఛత్రపతి హత్య తరువాత, కుటుంబం కేసు నమోదు చేసి, తరువాత దానిని సీబీఐకి అప్పగించారు. సీబీఐ 2007 లో చార్జిషీట్ దాఖలు చేసి ఛత్రపతి హత్యకు రామ్ రహీమ్ కుట్ర పన్నారని ఆరోపించారు. అంతకుముందు 2017 ఆగస్టు 28 న ఇద్దరు మహిళలపై లైంగికదాడి కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల శిక్ష విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.