మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 19:38:10

ర‌కుల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశాం: ఎన్‌సీబీ

ర‌కుల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశాం: ఎన్‌సీబీ

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌తో సంబంధం క‌లిగిన‌ డ్ర‌గ్స్ కేసులో ద‌ర్యాప్తు వేగంగా కొన‌సాగుతున్న‌ది. తాజాగా హీరోయిన్‌ ర‌కుల్‌ప్రీత్ సింగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారించింది. ఈ కేసు ద‌ర్యాప్తు కోసం నియ‌మించిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (ఎస్ఐటీ) ఈరోజు ర‌కుల్ ప్రీత్‌సింగ్ వాంగ్మూలాన్ని న‌మోదు చేసింద‌ని ఎన్‌సీబీ డైరెక్ట‌ర్ అశోక్ జైన్ తెలిపారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ నుంచి తీసుకున్న‌ స్టేట్‌మెంట్ ముందుగా‌ విశ్లేషించబ‌డుతుంద‌ని, ఆ త‌ర్వాత దాన్ని కోర్టుకు స‌మ‌ర్పిస్తార‌ని ఆయ‌న తెలిపారు.    ‌            

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo