బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 19:54:53

టీఆర్ఎస్ మ‌ద్ద‌తు.. సంస్కృత వ‌ర్సిటీ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

టీఆర్ఎస్ మ‌ద్ద‌తు.. సంస్కృత వ‌ర్సిటీ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

హైద‌రాబాద్‌: సంస్కృత వ‌ర్సిటీ బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీ వీ.ల‌క్ష్మీకాంతరావు ఇవాళ రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు.  సంస్కృత వ‌ర్సిటీల బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సంస్కృత భాష ఎన్నో అవాంత‌రాల‌ను ఎదుర్కొన్న‌ద‌ని, ఆయినా ఆ భాష బ్ర‌తికి బ‌ట్ట‌క‌ట్టింద‌న్నారు. క‌ర్నాట‌క‌లోని షిమాగో జిల్లాలో ఉన్న ముత్తు గ్రామంలో ప్ర‌తి ఒక్క‌రూ సంస్కృత భాష మాట్లాడుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.  ఆచార్య‌లు, స్వాములు అక్క‌డ‌కు వెళ్లి సంస్కృతం నేర్చుకుంటున్నార‌న్నారు.  సంస్కృత వ‌ర్సిటీల‌ను కేంద్రం త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డం స్వాగ‌తించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. సంస్కృతం మాట్లాడి, రాయ‌గ‌లిగే పండితుల‌కు ఉన్న‌త ప‌ద‌వులు క‌ల్పించాల‌న్నారు.  చ‌ర్చ అనంత‌రం ఇవాళ కేంద్ర సంస్కృత వ‌ర్సిటీ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది.logo