ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Sep 23, 2020 , 03:01:51

విపక్షం లేకుండానే బిల్లులు పాస్‌!

విపక్షం లేకుండానే బిల్లులు పాస్‌!

న్యూఢిల్లీ: రాజ్యసభ చరిత్రలోనే మంగళవారం అత్యంత వేగంగా పలు బిల్లులను మోదీ సర్కార్‌ ఆమోదింపజేసుకున్నది. ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ దాదాపుగా ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశాలను బహిష్కరించగా, అధికారపక్షం.. దానికి మద్దతుగా ఉన్న కొన్ని పార్టీలు అత్యంత కీలకమైన బిల్లులను ఆమోదించాయి. మూడున్నర గంటల్లోనే సభ ఏకంగా ఏడు బిల్లులకు ‘ఆమోదం తెలుపటం’ విశేషం. 

  1. దేశంలో కొత్తగా 5 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌ (ఐఐఐటీ) ఏర్పాటు. వీటిని జాతీయ ప్రాధాన్యం గల ఐఐఐటీలుగా బిల్లులో పొందుపర్చారు.
  2. నిత్యావసర సరుకుల చట్ట సవరణ బిల్లు. పప్పుధాన్యాలు, ఉల్లిగడ్డలు, నూనెగింజలు, వంటనూనెలు, ఆలుగడ్డలు మొదలైన వాటిని అత్యవసర సరుకుల జాబితా నుంచి తొలిగించారు. వీటి నిల్వ, మార్కెటింగ్‌పై నియంత్రణలు ఎత్తివేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. 
  3. బ్యాంకుల నియంత్రణ చట్టసవరణ బిల్లు. ఖాతాదారుల ప్రయోజనాల రక్షణ దృష్ట్యా సహకార బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తెస్తూ ఈ బిల్లులో సవరణలు చేశారు. 
  4. కంపెనీల చట్టసవరణ బిల్లు-2020. కొన్ని రకాల నేరాలపై కంపెనీలకు విధించే శిక్షలను రద్దుచేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
  5. నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ బిల్లు-2020. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. 
  6. పన్నులు, ఇతర చట్టాల (సడలింపులు, పలు నిబంధనల సవరణ) బిల్లు-2020. కరోనా నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపుల్లో జాప్యానికి అనుమతించేలా ఈ బిల్లులో సవరణలు చేశారు.
  7. రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ బిల్లు-2020. దీనిని గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నారు. అత్యుత్తమమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటుపై ఈ యూనివర్సిటీలో బోధన, పరిశోధన నిర్వహిస్తారు. 


VIDEOS

logo