శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 11:10:35

మాస్క్‌లు ధ‌రించి.. రాజ్య‌స‌భలో మాట్లాడిన‌ స‌భ్యులు

మాస్క్‌లు ధ‌రించి.. రాజ్య‌స‌భలో మాట్లాడిన‌ స‌భ్యులు

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో..  ఇవాళ కొంద‌రు ఎంపీలు రాజ్య‌స‌భ‌కు మాస్క్‌ల‌తో వ‌చ్చారు.  అయితే దీనిపై చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  ముఖానికి పెట్టుకున్న మాస్క్‌ల‌ను తీసివేయాల‌ని స‌భ్యుల‌ను కోరారు.  రాజీవ్ గౌడ‌, ఆనంద్ శ‌ర్మ‌లు.. చైర్మ‌న్ సూచ‌న‌ల ప‌ట్ల స్పందించారు.  క‌రోనా సాకుతో పార్ల‌మెంట్‌ను వాయిదా వేయ‌రాదు అని కోరారు.  క‌రోనా వైర‌స్‌కు తాము ఎంపీల‌మ‌న్న విష‌యం తెలియ‌ద‌ని గౌడ అన్నారు. 

స‌భ కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగేందుకు స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కోరారు.  ఆ స‌మ‌యంలో మ‌రో సారి చైర్మ‌న్‌.. మాస్క్‌లు తీసివేయాల‌ని స‌భ్యుల‌ను కోరారు. ఈ విష‌యం వ్యక్తిగ‌త‌మైంద‌ని, దాన్ని ఎవ‌రిది వాళ్ల‌కే వ‌దిలేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ చిదంబ‌రం అన్నారు.  ఏపీ, తెలంగాణ‌కు చెందిన వారు మ‌లేషియాలో చిక్కుకున్న‌ట్లు మొహ‌మ్మ‌ద్ అలీ ఖాన్ అన్నారు.  తృణ‌మూల్ ఎంపీ న‌దీముల్ హ‌క్ మాస్క్‌తోనే మాట్లాడారు.   

స‌భ‌కు వ‌చ్చే స‌మ‌యంలో చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు.. త‌న టెంప‌రేచ‌ర్ చెక్ చేయించుకున్నారు.  థ‌ర్మోమీట‌ర్ గ‌న్‌తో ఆయ‌నకు వైద్య ప‌రీక్ష‌లు చేశారు.  క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే నేప‌థ్యంలో ఈ త‌ర‌హా వైద్య ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. 


logo