బుధవారం 27 మే 2020
National - May 23, 2020 , 11:19:11

డీఎంకే ఎంపీ భార‌తి అరెస్టు..

డీఎంకే ఎంపీ భార‌తి అరెస్టు..


హైద‌రాబాద్‌:  డీఎంకే పార్టీకి చెందిన రాజ్య‌స‌భ ఎంపీ ఆర్ఎస్ భార‌తిని ఇవాళ చెన్నై పోలీసులు  అరెస్టు చేశారు. ఎస్సీ,ఎస్టీ చ‌ట్టం కింద ఆయ‌న్ను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది.  అణ‌గారిని వ‌ర్గాల‌పై ఎంపీ భార‌తి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆది త‌మిజార్ పెరావాయి ద‌ళిత నేత అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన క‌ళైనార్ రీడింగ్ స‌ర్కిల్ వ‌ద్ద నిర్వ‌హించిన స‌మావేశంలో ఎంపీ భార‌తి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  ద్రావిడ మున్నేత్ర క‌జ‌గం పార్టీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శిగా కూడా భార‌తి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన త‌ర్వాత ఆయ‌న్ను మెడిక‌ల్ చెక‌ప్ కోసం హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు.  డిప్యూటీ సీఎం ప‌న్నీరుసెల్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో త‌నను అరెస్టు చేసిన‌ట్లు ఎంపీ భార‌తి తెలిపారు.  కోవిడ్‌19 వైద్య ప‌రిక‌రాల స‌ర‌ఫ‌రాలో తీవ్ర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు భార‌తి ఆరోపించారు.


logo