శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 12:07:50

11 మంది ఎంపీల‌కు రాజ్య‌స‌భ వీడ్కోలు

11 మంది ఎంపీల‌కు రాజ్య‌స‌భ వీడ్కోలు

న్యూఢిల్లీ : ఈ ఏడాది న‌వంబ‌ర్ చివ‌రి నాటికి 11 మంది రాజ్య‌స‌భ‌ ఎంపీల‌కు ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో 11 మంది ఎంపీల‌కు రాజ్య‌స‌భ వీడ్కోలు ప‌లికింది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు నేటితో ముగియ‌నుండ‌డంతో వారికి వీడ్కోలు ప‌లికిన‌ట్లు రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు తెలిపారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్న ఎంపీలు ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నాయ‌కులు. వీరిలో కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి, స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు రామ్ గోపాల్ యాద‌వ్‌, బీఎస్పీ నాయ‌కుడు వీర్ సింగ్‌, కాంగ్రెస్ నేత రాజ్ బాబ‌ర్‌తో పాటు జావేద్ అలీఖాన్‌(ఎస్పీ), పీఎల్ పునియా(కాంగ్రెస్), రాజారాం(బీఎస్పీ), నీర‌జ్ శేఖ‌ర్(బీజేపీ), అరుణ్ సింగ్(బీజేపీ), ర‌వి ప్ర‌కాశ్ వ‌ర్మ‌(ఎస్పీ), చంద్ర‌పాల్ సింగ్ యాద‌వ్‌(ఎస్పీ) ఉన్నారు.


logo