శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 12:40:57

ఆగ‌ని విప‌క్షాల ఆందోళ‌న‌.. రాజ్య‌స‌భ వాయిదా

ఆగ‌ని విప‌క్షాల ఆందోళ‌న‌.. రాజ్య‌స‌భ వాయిదా

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.  విప‌క్షాల నినాదాల మ‌ధ్య స‌భ‌ను చైర్మ‌న్ వాయిదా వేశారు.  హోళీ వేడుక‌ల త‌ర్వాత ఈనెల 11వ తేదీన మ‌ళ్లీ స‌భ స‌మావేశంకానున్న‌ది. మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రుపుకోనున్న‌ నేప‌థ్యంలో.. చైర్మ‌న్ వెంక‌య్య స‌భ‌లో కొన్ని అంశాలు మాట్లాడారు. స‌మాజంలోని అన్ని రంగాల్లో మ‌హిళ‌లు విశేష పాత్ర పోషిస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా వైర‌స్‌పై గురువారం కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చేసిన కామెంట్స్‌ను కొన్ని ప‌త్రిక‌లు ప్ర‌చురించ‌లేక‌పోయాయ‌ని తెలిపారు. వెంక‌య్య మాట్లాడిన త‌ర్వాత‌.. స‌భ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో స‌భ‌ను చైర్మ‌న్ వాయిదా వేశారు. 


logo