శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:09:03

రాజ్‌నాథ్‌ సింగ్‌ది వాక్చాతుర్యమే : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

రాజ్‌నాథ్‌ సింగ్‌ది వాక్చాతుర్యమే : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : భారత భూభాగంలో ఏ ఒక్కరూ అంగుళం కూడా తాకలేని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం తిప్పికొట్టారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ది కేవలం వాక్చాతుర్యమేనని ఆయన ఎద్దేవా చేశారు. భారత భద్రతా సంస్థల అంచనా ప్రకారం చైనా దళాలు భారత భూభాగం వైపు ఇంకా దూసుకొస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.

చైనా దళాలు లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్ఏసీ)ని దాటి 1.5 కిలోమీటర్ల వరకు దూసుకొచ్చాయని భారత భద్రతా సంస్థలు ఇప్పటికే అంచనా వేసినట్లు గుర్తు చేశారు. మేలో చైనా దళాలు ఎల్‌ఏసీకి 5 కిలోమీటర్ల వరకు చొరబడ్డాయి అని శనివారం ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘భారత భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేరనేవి’ వట్టి మాటలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం వాస్తవాన్ని అంగీకరించనంత కాలం యథాతథ స్థితి అగమ్యగోచరమే' అని చైనా చొరబాట్లను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.


logo