సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 09:32:40

నేడు అమర్‌నాథ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

నేడు అమర్‌నాథ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

శ్రీనగర్‌ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమర్‌నాథ్‌ గుహను సందర్శించనున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే ఆయనతో కలిసి లడఖ్‌, జమ్మూ కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.  వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ), నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) రెండింటి వద్ద పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. తన పర్యటన మొదటి రోజు శుక్రవారం లడఖ్‌లోని దళాలతో రక్షణ మంత్రి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్,  ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానేతో భేటీ అయ్యారు.

‘సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి, కానీ దాన్ని ఎంత వరకు పరిష్కరించవచ్చో నేను హామీ ఇవ్వలేను. నేను మీకు భరోసా ఇస్తున్నాను, మన భూమిలో ఒక అంగుళం కూడా ప్రపంచంలోని ఏ శక్తి అయినా తీసుకోలేదు’  అని లుకుంగ్‌లోని భారత సైన్యం, ఐటీబీపీ సిబ్బందితో భారత్-చైనా ప్రతిష్టంభన గురించి రక్షణ మంత్రి అన్నారు. ప్రతిష్టంభనకు దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనాలని,  చర్చల ద్వారా పరిష్కారం కనుగొనగలిగితే అంతకంటే మెరుగైనది మరొకటి లేదని చెప్పారు. ‘ఇటీవల పీపీ14లో భారత్ - చైనా దళాల మధ్య ఏమి జరిగింది.. మా సిబ్బందిలో కొందరు మా సరిహద్దును రక్షించడంలో తమ ప్రాణాలను ఎలా త్యాగం చేశారు. నేను మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది, అయితే వారిని కోల్పోయినందుకు విచారంగా ఉన్నాను. వారికి నివాళులు అర్పిస్తున్నా’ అని రాజ్‌నాథ్‌ అన్నారు.

కాగా, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ నిరంతరం కాల్పుల విరమణ ఉల్లంఘనలు చేస్తూనే ఉండగా, చైనా ఇటీవల కాలంలో లడఖ్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చింది. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన పోరాటంలో 20 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. చైనా సైనికులు సైనిక స్థాయి, దౌత్యస్థాయి ద్వారా రెండు దేశాల మధ్య సంభాషణల తర్వాత వెనక్కి వెళ్లడం ప్రారంభించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo