సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 16:20:22

ర‌ష్యా విక్ట‌రీ డే ప‌రేడ్‌కు రాజ్‌నాథ్ సింగ్‌

ర‌ష్యా విక్ట‌రీ డే ప‌రేడ్‌కు రాజ్‌నాథ్ సింగ్‌

హైద‌రాబాద్‌: ఈనెల 24వ తేదీన ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో జ‌ర‌గ‌నున్న విక్ట‌రీ డే ప‌రేడ్ వేడుక‌ల్లో .. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ పాల్గొన‌నున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో విజ‌యం సాధించి 75 ఏళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా ప్ర‌త్యేక ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. భార‌త్‌కు చెందిన 75 మంది మిలిట‌రీ బృందం కూడా ఈ ప‌రేడ్‌లో పాల్గొంటున్న‌ది.  ర‌ష్యాతో పాటు మిత్ర దేశాలు క‌న‌బ‌రిచిన సాహ‌సం, త్యాగాల‌ను స్మ‌రిస్తూ విక్ట‌రీ డే ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. 

ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయ్‌గు.. రాజ్‌నాథ్‌ను ఈ ప‌రేడ్‌కు ఆహ్వానించారు. వాస్త‌వానికి మే 9వ తేదీన విక్ట‌రీ డే జ‌ర‌గాల్సి ఉంది. కానీ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ వేడుక‌ల‌ను వాయిదావేశారు.భార‌త‌ ద‌ళానికి సిక్కు ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన మేజ‌ర్ ర్యాంక్ ఆఫీస‌ర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో సిక్కు రెజిమెంట్ పాల్గొన్న‌ది. సిక్కు రెజిమెంట్‌కు నాలుగు యుద్ధ అవార్డులు ల‌భించాయి.  logo