బుధవారం 27 జనవరి 2021
National - Jan 08, 2021 , 15:37:14

ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రక్షణమంత్రి

ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రక్షణమంత్రి

న్యూఢిల్లీ :  వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్, ల్యాప్‌టాప్‌లతో సహా ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌లో సీఎస్‌డీ క్యాంటీన్‌ల ద్వారా విక్రయించే పోర్టల్‌ను శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. పోర్టల్ ‘45 లక్షల సీఎస్‌డీ (క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్) లబ్ధిదారులకు వారి ఇంటి సౌలభ్యం నుంచి ఏఎఫ్‌డీఐ-ఐ వస్తువులను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు. AFD-1 కేటగిరీలో పైన తెలిపిన వస్తువులతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్లు, డిష్‌ క్లీనర్‌, హోమ్ థియేటర్లు, మొబైల్ ఫోన్లు మొదలైన ఖరీదైన వస్తువులు ఉన్నాయి. సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులు సీడీఎస్‌ క్యాంటీన్‌లను ఉపయోగిస్తున్నారు. అందరు జవాన్లు, సాయుధ దళాల అధికారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. పోర్టల్‌ను డిజిటల్‌ ఇండియాకు అనుగుణంగా ఉందని, దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారన్నారు. 


logo