బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 12:42:07

రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన పథకం ప్రారంభం

రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన పథకం ప్రారంభం

రాయ్‌పూర్‌ : రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన పథకాన్ని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 29వ వర్థంతి సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం భూపేష్‌ బగాలే నేడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు బంధు స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందడుగు వేసింది. రైతులను ఆదుకునేందుకు రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. పథకం అమలులో భాగంగా నేడు మొదటిదశలో రూ. 1500 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమచేసింది. ఈ పథకం కింద మొత్తం రూ.5,700 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 53 వేల 706 మంది సన్నకారు రైతులు, 5 లక్షల 60 వేల మంది చిన్నకారు రైతులు అదేవిధంగా 3 లక్షల 20 వేల 844 మంది పెద్ద రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
logo