బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 13:00:24

మ‌ద్యం అమ్మ‌కాల‌పై మండిప‌డ్డ ర‌జ‌నీకాంత్‌..!

మ‌ద్యం అమ్మ‌కాల‌పై మండిప‌డ్డ ర‌జ‌నీకాంత్‌..!

కొద్ది రోజుల క్రితం  దేశ‌మంత‌టా మ‌ద్యం దుకాణాల‌ని తెర‌చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు నెల‌కొన్నాయి.  మందుబాబులు భౌతిక దూరం మ‌ర‌చి దుకాణాల ముందు నిలుచుంటున్నార‌ని, ఇలా చేస్తే క‌రోనా ఎఫెక్ట్ వారి ఫ్యామిల‌పై కూడా ప‌డుతుంద‌ని అన్నారు. మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖ‌లు మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డాన్ని ఖండించారు.

తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడులో కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్ర‌మంలో మ‌ద్యం దుకాణాల‌ని తెర‌వ‌డాన్ని వ్య‌తిరేఖించారు. ఈ స‌మ‌యంలో రాష్ట్రం మ‌ద్యం దుకాణాల‌ని తిరిగి తెరిస్తే, మ‌ళ్ళీ అధికారంలోకి రావాల‌నే క‌ల‌ని మ‌రిచిపోవాలి అని త‌న ట్వీట్ ద్వారా ఎఐఎడిఎంకె ప్ర‌భుత్వానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రంలో  మ‌ద్యం అమ్మ‌కాల‌ను నిలిపివేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం  సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వేళ మ‌ద్యం దుకాణాల వ‌ద్ద మందుబాబులు సోష‌ల్ డిస్టాన్సింగ్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారని, అందుకే మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఆపేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశించింది. కేవ‌లం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే మ‌ద్యాన్ని అమ్మాలంటూ హైకోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. 


logo