ఆదివారం 31 మే 2020
National - May 21, 2020 , 10:23:08

రాజస్థాన్‌లో మరో 83 కరోనా కేసులు

రాజస్థాన్‌లో మరో 83 కరోనా కేసులు

జైపూర్‌: రాజస్థాన్‌లో గత 24 గంటల్లో కొత్తగా 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,098కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాలు 150కి పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులో 2,527 యాక్టివ్‌గా ఉండగా, 3031 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా దుంగార్పూర్‌లో 28 నమోదగా, ఉదయ్‌పూర్‌లో 10, జైపూర్‌లో 8 నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. గత 24 గంటల్లో 5609 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo