మంగళవారం 02 మార్చి 2021
National - Jan 22, 2021 , 16:32:42

5 నెల‌ల్లో 31 సార్లు క‌రోనా పాజిటివ్‌..

5 నెల‌ల్లో 31 సార్లు క‌రోనా పాజిటివ్‌..

జైపూర్: రాజ‌స్థాన్‌కు చెందిన శార‌ద అనే మ‌హిళ‌కు అయిదు నెల‌ల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అయినా ఆమెకు మాత్రం ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవు.  క్ర‌మంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న‌ అక్క‌డ డాక్ట‌ర్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది.  భ‌ర‌త్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం హాస్పిట‌ల్‌లో ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స చేస్తున్నారు.  అప్నా ఘ‌ర్ అనే ఆశ్ర‌మానికి చెందిన ఆమెను జైపూర్‌లోని ఎస్ఎంఎస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాల‌ని భావిస్తున్నారు.  గ‌త ఏడాది ఆగ‌స్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి క‌రోనా ప‌రీక్ష చేశారు. దాంట్లో ఆమె పాజిటివ్‌గా తేలింది.  మాన‌సిక‌స్థితి స‌రిగా లేని ఆమెకు హాస్పిట‌ల్ చికిత్స చేశారు. ఆమె వెంట ఓ అటెండెంట్ కూడా ఉన్న‌ది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు శార‌ద‌కు 31 సార్లు కోవిడ్ ప‌రీక్ష‌లు చేశార‌ని, ప్ర‌తిసారీ ఆమె పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ భ‌ర‌ద్వాజ్ తెలిపారు. ఆయుర్వేద‌, హోమియో, అలోప‌తి మందుల‌తో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.   

VIDEOS

logo