e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ప్రియుడితో క‌లిసి ప‌సిబిడ్డ‌ను చంపిన త‌ల్లి..!

ప్రియుడితో క‌లిసి ప‌సిబిడ్డ‌ను చంపిన త‌ల్లి..!

ప్రియుడితో క‌లిసి ప‌సిబిడ్డ‌ను చంపిన త‌ల్లి..!

జైపూర్: రాజ‌స్థాన్‌కు చెందిన ఓ మ‌హిళ ప్రియుడి మోజులోప‌డి త‌ల్లి అనే ప‌దానికే క‌లంకం తెచ్చింది. భ‌ర్త‌ను వదిలేసి ప‌సిబిడ్డ‌తోపాటు ప్రియుడితో వెళ్ల‌డ‌మేగాక‌, ఆ ప‌సిబిడ్డ‌ను క‌ర్క‌శంగా చంపేసి అడ‌విలో ప‌డేసింది. రాజ‌స్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. జైపూర్ జిల్లాలోని బోర్ఖెరా గ్రామానికి చెందిన సుమిత్ యాద‌వ్‌, టీనా భార్యాభ‌ర్త‌లు. వారికి నందిని అనే నాలుగేండ్ల కుమార్తె ఉన్న‌ది.

అయితే పొరుగున ఉండే ప్ర‌హ్లాద్ స‌హాయ్ అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న టీనా.. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 11న భ‌ర్త‌ను వ‌దిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. దాంతో తన భార్య, కుమార్తె కనిపించడం లేదంటూ గతేడాది డిసెంబరు 16న సుమిత్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని టీనా కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు టీనా ఆచూకీ లభ్యమైంది.

జైపూర్ జిల్లాలోని ఉడావాలా గ్రామంలో త‌న ప్రియుడు ప్ర‌హ్లాద్‌తో క‌లిసి టీనా ఉన్నట్టు ఈ నెల 13న పోలీసులు గుర్తించారు. టీనాను అదుపులోకి తీసుకుని నందిని గురించి విచారించ‌గా ప్రియుడు ప్రహ్లాద్‌తో కలిపి నందినిని చంపేసిన‌ట్లు ఒప్పుకుంది. నందిని మృత‌దేహాన్ని అల్వార్‌లోని సరిస్కా అడవిలో పడేసినట్టు చెప్పింది. దాంతో పోలీసులు నిందితులు ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రియుడితో క‌లిసి ప‌సిబిడ్డ‌ను చంపిన త‌ల్లి..!

ట్రెండింగ్‌

Advertisement