మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 02, 2020 , 12:28:08

మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ చ‌ట్టం!

మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ చ‌ట్టం!

జైపూర్ : క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. వ్యాక్సిన్ వ‌చ్చే మాస్క్‌ను ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్‌గా భావించాల‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఈ నేప‌థ్యంలో మాస్క్‌ను ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం చ‌ట్టం చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. కొవిడ్ రోగుల ఆరోగ్య భ‌ద్ర‌త దృష్ట్యా బాణాసంచాను అమ్మ‌డం, కాల్చ‌డం నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ఆయా దేశాల్లో క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావ‌డంతో మ‌నం కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అశోక్ గెహ్లాట్ సూచించారు. 

రాజ‌స్థాన్‌లో ఆదివారం క‌రోనాతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,98,747కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 15,255.