బుధవారం 08 జూలై 2020
National - Jun 07, 2020 , 08:10:23

మొబైల్‌ గేమ్‌ ఆడుతూ బాలుడు ఆత్మహత్య

మొబైల్‌ గేమ్‌ ఆడుతూ బాలుడు ఆత్మహత్య

రాజస్థాన్‌ : మొబైల్‌ గేమ్‌ పబ్జీ ఆడుతూ 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రం కోటాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జీ హన్స్‌రాజ్‌ మీనా వివరాలను వెల్లడిస్తూ... ఆర్మీ మ్యాన్‌కు చెందిన కొడుకు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. బాలుడు మూడు రోజులక్రితం తల్లి మొబైల్‌ ఫోన్‌లో గేమింగ్‌ ప్రొగ్రాంను డౌన్‌లోడ్‌ చేశాడు.

శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు తన సోదరుడు చదువుకుంటున్న గదిలో గేమ్‌ ఆడుతూ ఉన్నాడు. నిద్రకని చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లి కిటికి చువ్వలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేసరికి అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. బాలుడి తండ్రి ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.


logo