మంగళవారం 31 మార్చి 2020
National - Mar 14, 2020 , 11:41:11

రాజస్థాన్‌లో విద్యాసంస్థలు, సినిమాహాళ్లు బంద్‌

రాజస్థాన్‌లో విద్యాసంస్థలు, సినిమాహాళ్లు బంద్‌

జైపూర్‌ : కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్‌లు, జిమ్స్‌, సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం నేడు ఉత్వర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన బోర్డు ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ ప్రకారం యధావిధిగా కొనసాగనున్నట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. దేశంలో కోవిడ్‌-19 కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో 82 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఇప్పటికే తమ తమ రాష్ర్టాల్లో విద్యాసంస్థలను, సినిమాహాళ్లను మూసివేస్తూ నిర్ణయం వెలువరించారు.


logo
>>>>>>