శనివారం 11 జూలై 2020
National - Jun 05, 2020 , 15:50:04

ఓ వ్యక్తి గొంతును మోకాలితో నొక్కిన పోలీసు

ఓ వ్యక్తి గొంతును మోకాలితో నొక్కిన పోలీసు

జోధ్‌పూర్‌‌: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను పోలీసు అధికారి మోకాలితో గొంతు నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి అతడి మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడ తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, ఇదే తరహా ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ముఖానికి మాస్క్‌ లేకుండా తిరుగుతున్న ముఖేశ్‌ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. అతడు ప్రతిఘటించడంతో కిందపడేసిన ఓ పోలీస్‌ ముఖేశ్‌ గొంతను తన మోకాలితో నొక్కిపెట్టాడు.

గమనించిన స్థానికులు కలుగుజేసుకోవడంతో అతడి గొంతుపై ఉంచిన మోకాలని ఆ పోలీస్‌ తొలగించాడు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరస్‌ అయ్యింది. మరోవైపు పోలీసులపై ముఖేశ్‌ దాడి చేశాడని, ఒకరి యూనిఫాం చించివేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రిపై దాడి చేసి కన్నుకు నష్టం కలిగించిన ఘటనలో అతడిపై ఒక పాత కేసు కూడా ఉందన్నారు. అయితే ముఖేశ్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని, ప్రస్తుత ఘటనలో అతడు గాయపడలేదని స్థానికులు పేర్కొన్నారు.

logo