శనివారం 30 మే 2020
National - May 10, 2020 , 10:54:28

రాజస్థాన్‌లో మరో 33 కరోనా కేసులు

రాజస్థాన్‌లో మరో 33 కరోనా కేసులు

జైపూర్‌: రాజస్థాన్‌లో ఈ రోజు కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,741కి చేరింది. ఈ రోజు నమోదైన కేసుల్లో జైపూర్‌లో పది, ఉదయ్‌పూర్‌, కోటాలో తొమ్మిది చొప్పున ఉన్నాయి. అజ్మిర్‌, పాలిల్లో చెరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో జైపూర్‌లో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 107కి పెరిగింది. మొత్తంగా 1458 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2176 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


logo