గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 10:17:59

రాజ‌స్థాన్‌లో రాజ్యాంగ సంక్షోభం.. సుప్రీంకోర్టుకు స్పీక‌ర్

రాజ‌స్థాన్‌లో రాజ్యాంగ సంక్షోభం.. సుప్రీంకోర్టుకు స్పీక‌ర్

హైద‌రాబాద్: రాజ్యాంగ సంక్షోభం దిశ‌గా రాజ‌స్థాన్ వెళ్తున్న‌ట్లు స్పీక‌ర్ సీపీ జోషీ ఆరోపించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకోవ‌డంలేద‌ని ఆయ‌న ఆరోపించారు. తాను రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు కేవ‌లం షోకాజ్ నోటీసులు మాత్ర‌మే జారీ చేసిన‌ట్లు స్పీక‌ర్ తెలిపారు. ఈ అంశంలో సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ ఫైల్ చేయాల‌ని త‌మ అధికారుల‌కు తెలిపిట్లు స్పీక‌ర్ వెల్ల‌డించారు.  స్పీక‌ర్‌కు ఉన్న అధికారాల‌ను, బాధ్య‌త‌ల‌ను.. సుప్రీంకోర్టు, రాజ్యాంగం స్ప‌ష్టంగా తెలియ‌జేసింద‌ని, స్పీక‌ర్‌గా నాకు అప్లికేష‌న్ వ‌చ్చింద‌ని, దాని ప్ర‌కార‌మే తాను రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  స్పీక‌ర్ షోకాజ్ నోటీసు ఇవ్వ‌కుంటే, మ‌రెవ‌రు ఆ పాత్ర‌ను పోషిస్తార‌ని జోషి ప్ర‌శ్నించారు. 

మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేల‌పై గ‌త వార‌మే స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటును ప్ర‌క‌టించారు. మూడు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స్పీక‌ర్ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే స‌చిన్ బృందం.. హైకోర్టును ఆశ్ర‌యించింది. ఆ కేసును విచారించిన కోర్టు.. స‌చిన్ టీమ్‌కు శుక్ర‌వారం వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. దీంతో షోకాజ్ నోటీసుల‌పై స్పంద‌న ఆల‌స్యం అవుతున్న‌ద‌ని స్పీక‌ర్ జోషి ఆరోపిస్తున్నారు.  రాజస్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు స‌చిన్ పైల‌ట్ కుట్ర ప‌న్నిన‌ట్లు సీఎం గెహ్లాట్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. 




logo