మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 17:05:08

అశోక్ గెహ్లాట్‌కు హైకోర్టులో ఊర‌ట‌

అశోక్ గెహ్లాట్‌కు హైకోర్టులో ఊర‌ట‌

జైపూర్‌: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్‌ పార్టీలో ఆరుగురు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) ఎమ్మెల్యేలు విలీనం కావడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ దాఖలు చేసిన‌ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా కోర్టుకు అందజేయాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆర్‌పీ సింగ్‌ను ఆదేశించింది.

కాగా, ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలతో అధికార కాంగ్రెస్ తన మెజారిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న‌ద‌ని మదన్ దిలావర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలోనూ స్పీకర్ ఉద్దేశ‌పూర్వ‌కంగా జాప్యం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మరోవైపు విలీనంపై బీజేపీ వేసిన పిటిషన్‌లో తమను కూడా చేర్చాలని కోరుతూ బీఎస్‌పీ సైతం హైకోర్టును ఆశ్రయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo