పెళ్లాం కోరిక తీర్చేందుకు ఓ భర్త అక్షరాల 7 లక్షల రూపాయలను ఖర్చుచేశాడు. ఓ సామాన్యుడు అంత ఖర్చు చేసి భార్య కోరికను తీర్చాడంటే వాడు మాములోడు కాదని జనం చూడటానికి ఎగబడ్డారు. ఇంతకీ భార్య ఖరీదైన ఆ కోరిక ఏంటంటే హెలికాఫ్టర్ లో అత్తారింట్లో అడుగుపెట్టాలన్నదే.
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా రాయ్పూర్ గ్రామానికి చెందిన సియారామ్ గుర్జార్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. నాద్బాయిలోని కరిలి గ్రామానికి చెందిన రమని పెళ్లాడాడు. పెళ్లి తరువాత అత్తగారి ఇంటికి హెలికాప్టర్లో వెళ్లాలన్నది నవ వధువు కోరిక. అది తెలుసుకున్న కొత్త పెళ్లి కొడుకు భార్య కోసం హెలికాఫ్టర్ ని రెడీచేశాడు. పుట్టింటికి హెలికాఫ్టర్ లోనే వెళ్లి పెళ్లాన్ని తీసుకొని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇందుకు గాను చాఫ్టర్ సంస్థకు 7లక్షలు చెల్లించాడు.
సియారామ్ ది ఒక సాధారణ రైతు కుటుంబం. భార్య కోరిందని లక్షలు ఖర్చు చేయడాన్ని కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకించారు. ఎప్పుడూ గ్రామానికి రాని హెలికాఫ్టర్ ఒక్కసారిగా ఊర్లోకి రావడంతో గ్రామస్తులంతా గుమికూడారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవడంతో నవవధువు సంతోషంగా అత్తారింట్లో కాలుపెట్టింది.