గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 12:57:27

యూజీ, పీజీ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం

యూజీ, పీజీ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం

జైపూర్‌: కరోనా నేపథ్యంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ పరీక్షలను రాజస్థాన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల పరిధిలో యూజీ, పీజీ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. ఉన్నత, సాంకేతిక విద్యకు సంబంధిచిన యూపీ, పీజీ కోర్సులకు ఈ ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదని చెప్పారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు త్వరలోనే మార్కులను కేటాయిస్తామని చెప్పారు.    

విద్యాశాఖ మంత్రి భన్వర్‌ సింగ్‌ భాటీ, సాంకేతిక విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌గార్గ్‌, ప్రధాన కార్యదర్శి రాజివ్‌ స్వరూప్‌ తదితర అధికారులతో చర్చించిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


logo