బుధవారం 08 జూలై 2020
National - Jun 28, 2020 , 12:57:52

పెండ్లికి హాజరైన వారిలో 15 మందికి కరోనా.. రూ.6 లక్షలకుపైగా జరిమానా

పెండ్లికి హాజరైన వారిలో 15 మందికి కరోనా.. రూ.6 లక్షలకుపైగా జరిమానా

జోధ్‌పూర్‌: ఓ పెండ్లికి హాజరైన వారిలో 15 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు వరుడి తండ్రికి రూ.6 లక్షలకుపైగా జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. భదాదా మొహల్లా నివాసి ఘిసులాల్ రతి తన కుమారుడి పెండ్లి కోసం ఈ నెల 13న గ్రాండ్‌గా ఓ విందు కార్యక్రమాన్ని నిర్వహించాడు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి 50 మందికిపైగా అతిథిలను ఆహ్వానించాడు. 

అయితే ఈ పెండ్లి విందుకు హాజరైన వారిలో 15 మందికి కరోనా సోకింది. అందులో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పెండ్లి కుమారుడి తండ్రిపై ఈ నెల 22న కేసు నమోదు చేశారు. పెండ్లికి హాజరైన అందరినీ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కాగా వారందరికీ కరోనా పరీక్షలు, ఆహారం, సౌకర్యాలు, అంబులెన్స్‌లో తరలింపు వంటి కోసం అయిన రూ.6,26,600 ఖర్చును చెల్లించాలని వరుడి తండ్రిని అధికారులు ఆదేశించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి జమచేయాలని చెప్పినట్లు జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర భట్‌ తెలిపారు. logo