సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 21:30:44

అక్కడ అక్టోబర్‌ 31 వరకు పాఠశాలలు బంద్‌

అక్కడ అక్టోబర్‌ 31 వరకు పాఠశాలలు బంద్‌

జైపూర్‌ : రాజస్థాన్‌లో అక్టోబర్‌ 31వ తేదీ వరకు పాఠశాలలు మూసే ఉండనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ ప్రకటన చేశారు.  విద్యార్థుల, తల్లిదండ్రుల డిమాండ్‌ మేరకు విద్యాస్థలను అక్టోబర్‌ ఆఖరి వరకు మూసి ఉంచాలని నిర్ణయానికి వచ్చినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంతకు ముందు సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పాఠశాల సెలవులను పొడగించాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మంగళవారం నాటికి 1,33,119 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo