బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:58:45

జైసల్మేర్‌కు రాజ‌స్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల త‌ర‌లింపు

జైసల్మేర్‌కు రాజ‌స్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల త‌ర‌లింపు

జైపూర్‌: రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు మ‌ద్ద‌తిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను శుక్ర‌వారం ప్ర‌త్యేక బ‌స్సుల్లో జైసల్మేర్‌కు త‌ర‌లించారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను ఆగ‌స్టు 14న నిర్వ‌హించేందుకు గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రా ఆమోదించ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డి హోట‌ల్‌లో వారిని ఉంచ‌నున్నారు. సీఎం గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన స‌చిన్ పైల‌ట్, ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న 18 మంది ఎమ్మెల్యేల‌పై కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త వేటు వేయ‌గా ఈ వ్య‌వ‌హారం కోర్టుకు చేరిన సంగ‌తి తెలిసిందే.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాదిరిగా రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర‌ప‌న్నుతున్న‌ద‌ని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. డ‌బ్బులు, ప‌ద‌వుల‌ను ఎర‌వేసి త‌మ ఎమ్మెల్యేల‌ను కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని, దీనికి సంబంధించి బ‌య‌ట‌ప‌డిన ఆడియో టేపుల‌పై విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం గెహ్లాట్‌కు మ‌ద్ద‌తిస్తున్న మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ‌త కొన్ని రోజులుగా జైపూర్‌లోని హోటల్ ఫెయిర్‌మాంట్‌లో ఉంటున్నారు. కాగా, త‌మ ప్ర‌భుత్వానికి మెజారిటీ ఉన్న‌ద‌ని సీఎం గెహ్లాట్ చెబుతున్నారు.  ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే ఆగ‌స్టు 14 వ‌ర‌కు జైసల్మేర్‌లోని హోట‌ల్‌లో ఉంచేందుకు శుక్ర‌వారం బ‌స్సుల్లో వారిని అక్క‌డ‌కు త‌ర‌లించారు.logo