గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 15:41:43

'హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్'.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పాట..

'హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్'.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పాట..

జైపూర్‌ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం ఫెయిర్‌మాంట్‌ హోటల్లో విశ్రాంతి తీసుకుంటూ 'హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్' (‘మేమూ ఓ రోజు విజయవంతమవుతాం’) అంటూ హుషారుగా గడిపారు. గెహ్లాట్ చుట్టూ 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చేరి అంత్యాక్షరి ఆడుతున్నవీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వారం కాంగ్రెస్ శానససభ పక్ష సమావేశం జరిగిన తరువాత గెహ్లాట్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు క్యాంపునకు వెళ్లారు.

నాటి నుంచి అనేక వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో బయటకు వస్తున్నాయి. వీటిలో ఎమ్మెల్యేలతోపాటు అశోక్ గెహ్లాట్‌ యోగా చేయడం, వంట నేర్చుకోవడం, సినిమాలు చూడటం, క్యారమ్స్‌ ఆడటం, సహచరుడి జన్మదిన వేడుకలు నిర్వహించడం కనిపించింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ విరుచుకుపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా నియంత్రణ నిబంధనలు ఉల్లఘించారని ఆరోపించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 50 మందికిపైగా సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు హోటళ్లో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆరోపించారు.

రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌తోపాటు 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సీసీ జోషి నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. వీరు నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికే సచి‌న్‌ పైలెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమని ప్రభుత్వాన్నిపడగొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రతిపక్ష పార్టీ యత్నిస్తోందని గెహ్లాట్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.logo