మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 10:25:47

స‌చిన్‌పై చ‌ర్య‌లు తీసుకోండి

స‌చిన్‌పై చ‌ర్య‌లు తీసుకోండి

జైస‌ల్మేర్‌: రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతున్న‌ది. సీంఎ అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వంపై ‌‌తిరుగుబాటు చేసిన స‌చిన్ పైల‌ట్‌, అత‌ని వ‌ర్గంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.  నిన్న సాయంత్రం జైస‌ల్మేర్‌లోని సూర్య‌గ‌ర్ హోట‌ల్లో సీఎం గెహ్లాట్ నేతృత్వంలో సీఎల్పీ మీటింగ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగ‌బాటు వ‌ర్గంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. కాగా, తిరుగుబాటు ఎమ్మెల త‌ర‌పున తాను పార్టీ హైక‌మాండ్ ముందు వాదించ‌లేన‌ని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అధ్య‌క్షుడు అవినాశ్ పాండే అన్న‌టు తెలిసింది. 

ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ నేతృత్వంలో 18 మంది ఎమ్మెల్యేలు గెల్హాట్ ప్ర‌భుత్వం తిరుగుబాటు చేశారు. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న‌ది. స‌చిన్ త‌న ఎమ్మెల్యేల‌తో ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో క్యాంపును నిర్వ‌హిస్తుండ‌గా, సీఎం గెహ్లాట్ మ‌ద్ద‌తుగా ఉన్న ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం జైస‌ల్మేర్‌లోని సూర్య‌గ‌ర్ హోట‌ల్లో ఉన్నారు. రాజ‌స్థాన్ అసెంబ్లీ స‌మావేశాలు ఈనెల 14న స‌మావేశం కానుంది. 

స‌చిన్ పైల‌ట్‌ను రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వుల నుంచి పార్టీ అధిష్టానం జూలై 14న తొల‌గించింది.

తాజావార్తలు


logo