సోమవారం 08 మార్చి 2021
National - Jan 20, 2021 , 12:23:28

అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

జైపూర్‌: రాజ‌స్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గ‌జేంద్ర‌సింగ్ శ‌క్తావ‌త్‌ (48) మ‌ర‌ణించారు. గ‌త కొంత కాలంగా లివ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. బుధ‌వారం ఉద‌యం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో క‌న్నుమూశారు. ఇటీవ‌ల ఆయ‌నకు క‌రోనా పాజిటివ్ కూడా వ‌చ్చిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. గ‌జేంద్ర‌సింగ్ శ‌క్తావ‌త్‌కు భార్య‌, ఒక కొడుకు, ఇద్ద‌రు బిడ్డ‌లు ఉన్నారు. ఉద‌య్‌పూర్ జిల్లాలోని వ‌ల్ల‌భ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 

కాగా, గ‌జేంద్ర శ‌క్తావ‌త్ మృతికి రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, రాజ‌స్థాన్ పీసీసీ అధ్య‌క్షుడు గోవింద్‌సింగ్ దొత‌స్రా, రాజ‌స్థాన్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్‌పైల‌ట్, ఇత‌ర నాయ‌కులు సంతాపం తెలియ‌జేశారు. ఇదిలావుంటే రాజ‌స్థాన్లో 2020, అక్టోబ‌ర్ నుంచి కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో మ‌ర‌ణించిన నాలుగో ఎమ్మెల్యే, మూడో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ‌క్తావ‌త్ అని అధికారులు తెలిపారు. అక్టోబ‌ర్‌లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌న్వ‌ర్‌లాల్ మేఘ‌వాల్, న‌వంబ‌ర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాస్ త్రివేది, బీజేపీ ఎమ్మెల్యే కిర‌ణ్ మ‌హేశ్వ‌రి మృతిచెందారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo