ఆదివారం 29 మార్చి 2020
National - Mar 24, 2020 , 16:11:41

ఇండ్ల నుంచి బ‌య‌టకు వ‌స్తే క‌ర్ఫ్యూనే: రాజ‌స్థాన్ సీఎం

ఇండ్ల నుంచి బ‌య‌టకు వ‌స్తే క‌ర్ఫ్యూనే: రాజ‌స్థాన్ సీఎం

జైపూర్‌: క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే ఉద్దేశంతో రాజ‌స్థాన్‌లో లాక్‌డౌన్ విధించినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ సీరియ‌స్ అయ్యారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు ఎవ‌రూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, లేదంటే క‌ర్ఫ్యూ విధించాల్సి  వ‌స్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. లాక్‌డౌన్ విధించినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ప్ర‌భుత్వం క‌న్నెర్ర జేసింది. దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

ఇదిలావుంటే, రాజ‌స్థాన్‌లో సోమ‌వారం సైతం మ‌రో నాలుగు కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో సీఎం గెహ్లాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్నది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు సోమ‌వారం లాక్‌డౌన్‌ను ఖాత‌రు చేయ‌కుండా రోడ్ల మీద‌కు వ‌చ్చారు. దీంతో మహారాష్ట్ర, పంజాబ్, చండీగఢ్, పుదుచ్చేరి, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి.


logo