బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 17:25:50

102 మందితో గెహ్లాట్ బ‌ల ‌ప్ర‌ద‌ర్శ‌న‌

102 మందితో గెహ్లాట్ బ‌ల ‌ప్ర‌ద‌ర్శ‌న‌

జైపూర్‌: రాజస్థాన్‌లో రాజకీయం ప‌లు మలుపులు తిరుగుతున్న‌ది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య విబేధాలు త‌లెత్త‌డం, స‌చిన్ పైల‌ట్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేయ‌డం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌స్థాన్‌లో రాజ‌కీయం సంక్షోభం నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య‌ గ‌త రెండు రోజుల నుంచి మాట‌ల యుద్ధం న‌డిచింది. త‌నవెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, గెహ్లాట్ ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డింద‌ని స‌చిన్ పైల‌ట్ ప్ర‌క‌టించ‌గా.. త‌మ‌కు కావాల్సినంత మెజారిటీ ఉంద‌ని, త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని గెహ్లాట్ ధీమా వ్య‌క్తం చేశారు. 

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం జైపూర్‌లో సీఎల్పీ సమావేశం జ‌రిగింది. ఈ భేటీలో మొత్తం 102 మంది ఎమ్మెల్యేలతో గెహ్లాట్ బలప్రదర్శన చేశారు. సీఎల్పీ భేటీ అనంత‌రం ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్ట్స్‌కు తరలించారు. ఇదిలావుంటే మరోవైపు రాహుల్‌గాంధీ,‌ ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగి ప‌రిస్థితి చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 


 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo