మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Aug 28, 2020 , 11:21:04

సీఎంఓ సిబ్బందికి క‌రోనా.. స్వీయ నిర్బంధంలో సీఎం ‌

సీఎంఓ సిబ్బందికి క‌రోనా.. స్వీయ నిర్బంధంలో సీఎం ‌

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది సహా తన నివాసంలో పనిచేస్తున్న పది మందికి కరోనా సోకినట్టు గురువారం నిర్ధారణ అయ్యింది. దీంతో ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా సీఎం త‌న అధికారిక కార్య‌క్ర‌మాల‌న్నింటినీ ర‌ద్దుచేసుకున్నారు. క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత ఏర్పాటు చేసిన మొద‌టి మంత్రిమండ‌లి స‌మావేశాన్ని కూడా ఆయ‌న రద్దు‌చేశారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి జైపూర్‌కు ఎవ్వ‌రూ రావ‌ద్ద‌ని కోరారు.  

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) పనిచేసే 9 మందికి, ముఖ్యమంత్రి అధికారిక నివాసం (సీఎంఆర్)లో పనిచేసే ఒకరికి కరోనా సోకినట్ల ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. సీఎం గెహ్లాట్ కేబినెట్‌లోని ప‌ర్యాట‌క శాఖ మంత్రి విశ్వేంద‌ర్ సింగ్ ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. 


logo