బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 14:42:10

సింధియా అవకాశవాది : రాజస్థాన్‌ సీఎం

సింధియా అవకాశవాది : రాజస్థాన్‌ సీఎం

జైపూర్‌ : కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా అవకాశవాది అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అవకాశవాదులు పార్టీని ముందే విడిచిపెట్టి ఉండేదన్నారు రాజస్థాన్‌ సీఎం. కాంగ్రెస్‌ పార్టీ సింధియాకు 18 ఏళ్లు జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడేమో అవకాశం రాగానే తన ధోరణిని బయటపెట్టుకున్నాడని అశోక్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. ఇలాంటి నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని రాజస్థాన్‌ సీఎం అన్నారు. 

సీనియర్‌ నేత జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. తక్షణమే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు సోనియాగాంధీ. మరికాసేపట్లో సింధియా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. సింధియాకు అనుకూలంగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. 


logo
>>>>>>