సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 11:33:40

సమావేశం కానున్న రాజస్థాన్‌ సీఎల్పీ

సమావేశం కానున్న రాజస్థాన్‌ సీఎల్పీ

జైపూర్‌ : రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) గురువారం ఫెయిర్‌మౌంట్‌ హోటల్‌లో సమావేశం కానుంది. బుధవారం గవర్నర్ కలరాజ్ మిశ్రా ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వు జారీ చేశారు. గవర్నర్ తన ఉత్తర్వుల్లో కొవిడ్‌ వ్యాప్తిని నివారించేందుకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సమావేశాల్లో అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలక కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ‌ముఖ్యమంత్రి పదేపదే విజ్ఞప్తి చేసిన అనంతరం గవర్నర్ అసెంబ్లీని సమావేశపరిచేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. గెహ్లాట్‌ మాజీ సచిన్ పైలట్ మధ్య విభేదాలు తలెత్తడం ద్వారా రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్‌గా తొలగించారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.


logo