శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 16:30:09

గెహ్లాట్ క‌న్నింగ్ పొలిటీషియ‌న్‌: బీజేపీ

గెహ్లాట్ క‌న్నింగ్ పొలిటీషియ‌న్‌: బీజేపీ

జైపూర్‌: రాజ‌స్థాన్లో అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర్చ‌డానికి బీజేపీ కుట్ర చేస్తున్న‌దంటూ రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప్ర‌తిప‌క్షంపై మండిప‌డ‌గా.. అశోక్ గెహ్లాట్ ఆరోప‌ణ‌లు శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని బీజేపీ కొట్టిపారేసింది. అశోక్ గెహ్లాట్ ఒక క‌న్నింగ్ పొలిటీషియ‌న్ అని రాజ‌స్థాన్ బీజేపీ అధ్య‌క్షుడు స‌తీష్ పూనియా విమ‌ర్శించారు. త‌న ప‌రిపాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పపుచ్చుకోవ‌డానికి గెహ్లాట్ బీజేపీపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

నిజానికి ఎవ‌రు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు చూస్తున్నారో గెహ్లాట్‌కు తెలుసని పూనియా చెప్పారు. అంత‌కుముందు అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న‌దని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్ర‌లు చేసినా త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఢోకా ఏం లేద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. గెహ్లాట్ వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా పూనియా తాజా వ్యాఖ్య‌లు చేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo