సోమవారం 25 జనవరి 2021
National - Dec 06, 2020 , 01:27:09

ఐదు ప్రభుత్వాలను కూల్చాం..రాజస్థాన్‌ ఆరోది!

ఐదు ప్రభుత్వాలను కూల్చాం..రాజస్థాన్‌ ఆరోది!

జైపూర్‌: రాజస్థాన్‌, మహారాష్ట్రలలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ మళ్లీ కుట్రలు పన్నుతున్నదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ హెచ్చరించారు. శనివారం సిరోహి జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై నేరుగా విమర్శలు చేశారు. ‘రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వారు (బీజేపీ) ప్రయత్నించారు. అమిత్‌షా, ధర్మేంద్ర ప్రధాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం ఆ భేటీ గురించి కాంగ్రెస్‌ సభ్యులు నాతో కీలక విషయాలు పంచుకున్నారు. అమిత్‌షాను కేంద్ర హోం మంత్రిగా చూడడానికి సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఐదు ప్రభుత్వాలను కూల్చామని, ఇది ఆరోదని ఆ నేతలు వ్యాఖ్యానించినట్టు చెప్పారు. బీజేపీ ఈ విధంగా కుట్రలు చేస్తున్నది’ అని గెహ్లాట్‌ పేర్కొన్నారు. దీన్ని బీజేపీ ఖండించింది. సొంత పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకుంటే బాగుంటుందని బీజేపీ నేత గులాబ్‌ చంద్‌ కటారియా పేర్కొన్నారు. 


logo