మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:09:46

మ‌రికొన్ని గంట‌ల్లో రాజ‌స్థాన్ క్యాబినెట్ భేటీ

మ‌రికొన్ని గంట‌ల్లో రాజ‌స్థాన్ క్యాబినెట్ భేటీ

జైపూర్‌: ‌రాష్ట్రంలో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాజ‌స్థాన్ క్యాబినెట్ ఈ సాయంత్రం స‌మావేశం కానున్న‌ది. ఈ మేర‌కు రాజ‌స్థాన్ సీఎం కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటు చేయ‌డంతో.. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక్షోభం అంచున నిలిచింది. అయితే, అశోక్‌గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన స‌చిన్ పైల‌ట్ బీజేపీలో చేరుతారా? లేదంటే సొంత పార్టీ పెడుతారా? అదీ లేదంటే తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతారా? అనే విష‌యంలో స‌స్పెన్స్ కొన‌సాగుతున్న‌ది. 

కాగా, స‌చిన్ పైల‌ట్‌తో మొత్తం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోవ‌డంతో గెహ్లాట్ ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డిపోయింద‌ని, ఆయ‌న అసెంబ్లీ బ‌లం నిరూపించుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష బీజేపీ డిమాండ్ చేస్తున్న‌ది. అటు స‌చిన్ పైల‌ట్ సైతం గెహ్లాట్ స‌ర్కారు మైనారిటీలో ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇప్ప‌టికిప్పుడు త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని, త‌మ‌కు 107 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని చెబుతున్నారు. 

ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అసెంబ్లీలో జ‌రుగ‌బోయే ఫ్లోర్ టెస్టుపైనే ఈ భేటీలో ప్ర‌ధానంగా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష జ‌రిగితే ప్ర‌భుత్వం కూలిపోకుండా ఎలా కాపాడుకోవాలి? ప్ర‌స్తుతం త‌మ వెంట ఉన్న‌ ఎమ్మెల్యేలు చేజార‌కుండా ఎలాంటి వ్యూహం పాటించాలి? ఇలా త‌దిత‌ర అంశాల‌పై క్యాబినెట్ భేటీలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo