ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:53:50

రేపు సాయంత్రం బీజేఎల్పీ స‌మావేశం

రేపు సాయంత్రం బీజేఎల్పీ స‌మావేశం

న్యూఢిల్లీ: ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొన‌సాగుతున్న‌ది. మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటు జెండా ఎగుర‌వేయ‌డంతో రాష్ట్ర‌ రాజకియాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. స‌చిన్ పైల‌ట్ త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో క్యాంపు నిర్వ‌హిస్తున్నారు. మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు త‌న నుంచి జారిపోకుండా జాగ్ర‌త్త‌ప‌డిన సీఎం గెహ్లాట్ జైస‌ల్మేర్‌లోని ఓ హోట‌ల్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. తిరుగుబాటునేత‌ స‌చిన్ పైల‌ట్ త‌న‌కు 30 ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని పేర్కొంటుండ‌గా,  ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌ని, త‌మ‌కు 109 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉన్న‌ద‌ని అధికార కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. 

బ‌ల నిరూపణకు అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం గెహ్లాట్ ప‌లుమార్లు గ‌వ‌ర్న‌ర్ క‌ల్రాజ్ మిశ్రాను కోరిన‌ప్ప‌టికీ ఆయ‌న అనుమ‌తించ‌లేదు. చివ‌రికి రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతుండ‌టం, దానికి సంబంధించి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌దనే విష‌యాల‌ను చ‌ర్చించ‌డానికి, ప‌లు బిల్లుల ఆమోదానికి అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ స‌మావేశాల‌కు అనుమ‌తించారు. దీంతో ఈనెల 14న స‌మావేశాలు జ‌ర‌గున‌న్నాయి. 

ఈనేప‌థ్యంలో రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌తిప‌క్ష బీజేఎల్పీ స‌మావేశం జ‌రుగుతుంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శ‌ర్మ ప్ర‌క‌టించారు. అసెంబ్లీలో బీజేపీకి 73 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 20 ఎమ్మెల్యేల‌ను రెండు బ్యాచిలుగా గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌, పోర్‌బంద‌ర్‌లోని క్యాంపుల‌కు త‌ర‌లించింది. 


logo