మంగళవారం 19 జనవరి 2021
National - Sep 26, 2020 , 19:04:54

తుపాకీతో కాల్చి క‌త్తితో పొడిచి.. బాలిక దారుణ‌హ‌త్య!

తుపాకీతో కాల్చి క‌త్తితో పొడిచి.. బాలిక దారుణ‌హ‌త్య!

జైపూర్‌: రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణం జ‌రిగింది. ప‌రీక్ష రాయ‌డం కోసం ఝుంఝును నుంచి జైపూర్‌ న‌గ‌రానికి వ‌చ్చిన‌ బాలిక‌ను ఓ యువ‌కుడు దారుణంగా హ‌త్య‌చేశాడు. తుపాకీతో కాల్చి, క‌త్తితో పొడిచి అతి కిరాత‌కంగా హ‌త‌మార్చాడు. జైపూర్‌లోని ఆద‌ర్శ‌న‌గ‌ర్ ఏరియాలో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌డిరోడ్డు మీద యువ‌కుడు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. అయితే, స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. 

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అత‌ని ద‌గ్గ‌రున్న ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృత‌దేహాన్ని పోస్టు మార్టానికి త‌ర‌లించారు. నిందితుడిపై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 302 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, ఈ హ‌త్య‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు.          ‌ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.